Rajinikanth Dance | కేరళ ప్రజలు నేడు ఓనం పండుగను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మలయాళీ క్యాలెండర్‌లోని మొదటి నెలయిన చింగం మాసంలో ఓనమ్ పండుగా వస్తుంది. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనమ్. ఈ పది రోజుల పండుగ 2024లో సెప్టెంబర్ 06న శుక్రవారం మొదలై.. ఆదివారంతో (సెప్టెంబర్ 15)తో ముగియనుంది. ఇక ఓనమ్ పండుగ సందర్భంగా.. కేరళలో ఇళ్ల ఎదుట పుప్పాల అలంకరణలు, కొత్త వస్త్రాలు, విందు భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటోంది.
అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఓనం పండుగను జరుపుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుంది. అయితే ఈ సినిమా సెట్స్‌లో రజనీకాంత్ పంచెకట్టులో ఓనం వేడుకలు జరుపుకున్నాడు. అంతేగాకుండా తన రీసెంట్ సూపర్ హిట్ పాట మనసిలాయో పాటకు స్టెప్పులు కూడా వేశాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Superstar celebrating Onam in style from the sets of #Coolie 🔥💥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/VhVNhmS2hI
— Sun Pictures (@sunpictures) September 15, 2024