Coolie | తలైవా రజనీకాంత్(Rajinikanth) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా ఇది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అగ్ర నటులు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇదిలావుంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా హిందీలో టైటిల్‌ను మార్చారు మేకర్స్. హిందీలో ఈ సినిమాను ‘మజ్దూర్'(Majadoor) అనే పేరుతో తీసుకురాబోతున్నట్లు సమాచారం. మజ్దూర్ అంటే హిందీలో కార్మికుడు అని అర్థం. అయితే కూలీ అనే టైటిల్ బానే ఉన్నప్పటికి పేరు మార్చడంపై చాలా మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గతంలో వచ్చిన అమితాబ్ బచ్చన్ కూలీ (1983), గోవిందా కూలీ నెం. 1 (1995), వరుణ్ ధావన్ కూలీ నెం. 1 (2020) వంటి చిత్రాల కాపీరైట్ సమస్యల వల్లే ఈ పేరు మార్పు జరిగిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
Hindi Title for Coolie is #Majadoor 🙁 pic.twitter.com/0IguPVWPls
— Christopher Kanagaraj (@Chrissuccess) June 24, 2025
Read More