రజినీకాంత్ సినిమాకు చిరంజీవి బ్లాక్‌బస్టర్ టైటిల్ !
రజినీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల విరామం తర్వాత ఈ మధ్యే సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ సినిమాకు తెలుగులో చిరంజీవి సూపర్‌హిట్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. అదే అన్నయ్య.

రజినీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల విరామం తర్వాత ఈ మధ్యే సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. వరుసగా అజిత్‌తో సినిమాలు చేసిన డైరెక్టర్ శౌర్యం శివ.. తొలిసారిగా రజినీకాంత్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా రజినీకాంత్ కూడా పర్ఫెక్ట్ బ్లాక్‌బస్టర్ ఇవ్వలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాపైనే అభిమానుల ఆశలు ఉన్నాయి. ఈ సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ అందుకుంటామని రజినీ కూడా ధీమాగా ఉన్నాడు.
ఎన్నో బ్రేకుల మధ్య సాగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకుచేరుకుంది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంకా చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో పాటు కొన్ని చిన్న చిన్న వర్కులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బ్యాలెన్స్ షూటింగ్ జరుగుతుంది. గతంలో వేదాళం సినిమాను కూడా ఎక్కువ భాగం కోల్‌కతాలోనే తెరకెక్కించాడు శివ. ఇప్పుడు మరోసారి రజినీకాంత్ సినిమా కోసం అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు, కుష్బూ, నయనతార, కీర్తి సురేశ్, మీనా వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు తెలుగులో చిరంజీవి సూపర్‌హిట్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. అదే అన్నయ్య.
2000వ సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అన్నయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ టైటిల్‌ను ఇప్పుడు రజినీ సినిమా కోసం ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అన్నాతే అంటే అన్నయ్య అని అర్థం. అలాగే ఈ టైటిల్ రజినీకాంత్ ఇమేజ్‌కు బాగా సరిపోతుంది అనుకుంటున్నారు మేకర్స్. ఈ మధ్య చిరంజీవి పాత టైటిల్స్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తమిళ హీరో కార్తి దొంగ, ఖైదీ టైటిల్స్ వాడుకున్నాడు. మొన్న కార్తికేయ రాజా విక్రమార్క అంటూ వచ్చాడు. ఇప్పుడు రజినీకాంత్ అన్నయ్య అంటున్నాడు. మరి ఇది ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రెండు నెలలుగా ఐసీయూలోనే హీరోయిన్ తనయుడు
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
ప్రశాంత్ నీల్.. నాలుగు నెలల్లో రెండు పాన్ ఇండియన్ సినిమాలు
ఇండస్ట్రీలోకి కోడిరామకృష్ణ కూతురు ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

