Jailer | సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్‌కుమార్, తమన్నా, రమ్యకృష్ణ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వీరందరిలో మోహన్‌లాల్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఆయన పాత్ర తాలూకు వివరాలను చిత్రబృందం బయటపెట్టలేదు. ట్రైలర్లో కూడా మోహన్‌లాల్ క్యారెక్టర్‌ను చూపించలేదు. దీంతో ఆయన క్యారెక్టర్ గురించి మలయాళీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి స్పందించారు మోహన్‌లాల్. ‘నేను చేసిన పాత్ర ఏమిటో చెబితే సస్పెన్స్ వీడిపోతుంది. అందుకే రహస్యంగా ఉంచుతున్నా. ప్రతీ ఒక్కరూ సర్ప్రైజ్ అయ్యేలా నా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.