Rajinikanth | మరోసారి ఆస్పత్రిలో చేరిన రజినీకాంత్.. సూపర్ స్టార్‌కు ఏమైంది..?
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇవాళ చెన్నైలోని కావేరి ఆస్పత్రి (Kauvery Hospital) లో చేరారు.హెల్త్ చెకప్‌లో భాగంగా రజినీకాంత్ ఆస్పత్రిలో చేరినట్టు కావేరీ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రి (Kauvery Hospital) లో చేరారు. రేపటి వరకు ఆయన ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు సమాచారం. రజిని హాస్పిటల్లో చేరాడనే విషయం తెలిసిన తర్వాత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఏమైంది.. ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆరా తీస్తున్నారు. ఈ మధ్య తరచూ హాస్పిటల్ పాలవుతున్నారు రజినీకాంత్. గతేడాది షూటింగ్ సమయంలో కూడా ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యారు సూపర్ స్టార్. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో ఈయన వారం రోజుల పాటు చికిత్స తీసుకొని ఆ తర్వాత చెన్నై వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన హాస్పిటల్ పాలవడం అభిమానుల్లో కంగారు పెంచుతుంది. కానీ ఇందులో ఎలాంటి కంగారు అవసరం లేదని.. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. కేవలం రెగ్యులర్ హెల్త్ చెక్ అప్ లో భాగంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. రజినీ చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఏ మాత్రం కంగారు పడాల్సిన పనిలేదని అధికారిక పీఆర్ నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం నార్మల్ హెల్త్ చెకప్ చేయించుకొని 24 గంటల్లో డిశ్చార్జి అవుతాడని చెబుతున్నారు.
అక్టోబర్ 25న రజినీకాంత్ భారత ప్రభుత్వం ( Indian government) చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (Dada Saheb Phalke award) అందుకున్నారు. అలాగే ఆయన కూతురు సౌందర్య రూపొందించిన ప్రజలకు ఉపయోగపడే వాయిస్ బేస్డ్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం HOOTE ( HOOTE APP)యాప్‌ను కూడా లాంఛ్ చేశారు. శివ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన అన్నాత్తే చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సినిమా తెలుగులో పెద్దన్నగా విడుదలవుతుంది. జగపతిబాబు, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తిసురేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

