Coolie Collections | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చాయి. తొలిరోజే ఈ చిత్రం రూ.151 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రకటించింది. దీంతో తమిళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో కూలీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు దళపతి విజయ్ నటించిన లియో(Leo Movie) చిత్రం పేరిటా ఉంది. ఈ చిత్రం తొలిరోజే రూ.148 కోట్ల వసూళ్లను రాబట్టింది.
Superstar Rajinikanth The Record Maker & Record Breaker 🔥🔥🔥#Coolie becomes the Highest ever Day 1 worldwide gross for a Tamil film with 151 Crores+#Coolie in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj… pic.twitter.com/k3wLtIMqPn
— Sun Pictures (@sunpictures) August 15, 2025