సూపర్ స్టార్ రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం జూన్ 19న అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్న రజనీకాంత్ అప్పటి నుండి ప్రతి సంవత్సరం చెక్‌ప్ కోసం అమెరికాకు వెళుతున్నారు. తాజాగా ఆయన మయో క్లినికల్ ఆస్పత్రిలో పలు పరీక్షలు చేయించుకున్నారు. అన్ని పరీక్షలలోను ఎలాంటి సమస్యలు లేవని తేలతడంతో రజనీకాంత్ తిరిగి ఈరోజు చెన్నైకి వచ్చారు.
శుక్రవారం తెల్లవారుఝామున రజనీకాంత్ చెన్నైకి వచ్చినట్టు తెలుస్తుండగా, ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారికి అభివందంనం చేసిన తలైవా అనంతరం తన కారులో ఇంటికి చేరుకున్నారు.రజనీకాంత్ నటించిన అన్నాత్తె చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది. రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. త్వరలో కూతురు సౌందర్య డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.