Rajendra Prasad apologizes to David Warner | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు క్షమాపణలు తెలిపాడు. నితిన్ సినిమా రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలపై వీడియో రూపంలో క్షమాపణలు చెప్పుకోచ్చాడు. నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ (RobinHood). ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మువీ మేకర్స్ నిర్మిస్తుంది. శ్రీలీల కథానాయిక. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా.. ఇందులో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ వార్నర్‌ని క్రికెట్ ఆడమంటే దొంగ ము* కొడుకు సినిమాలు చేస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అయితే నటకిరిటి ఇవి సరదాగా చేసిన కూడా మీడియాతో పాటు నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోశారు. దీంతో దిగోచ్చిన రాజేంద్ర ప్రసాద్ తాజాగా డేవిడ్ వార్నర్‌కు క్షమాపణలు తెలిపాడు. నాకు డేవిడ్ వార్నర్ అంటే చాలా ఇష్టం. అతడి క్రికెట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను అతడిపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలుపుతున్నాను. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా చూసుకుంటానంటూ రాజేంద్రప్రసాద్ చెప్పుకోచ్చాడు.
Warner did not deserve all of that!
Rajendra Prasad lost it.
Never thought such a versatile actor would fall to such lowspic.twitter.com/P0r3ytm89O— SS Sagar (@SSsagarHyd) March 24, 2025
డేవిడ్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్#DavidWarner #RajendraPrasad #Robinhood pic.twitter.com/TxOFoaVdt3
— Milagro Movies (@MilagroMovies) March 25, 2025