Rajeev Kanakala | టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ఇద్దరు డైరెక్టర్స్ కూడా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు దర్శకుల గురించి టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఇప్పటిదాకా తను వర్క్ చేసిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుల వర్కింగ్ స్టైల్ గురించి చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. రాజమౌళి గురించి మాట్లాడిన ఆయన.. తనకు కావలసిన ఔట్పుట్ వచ్చేదాకా సంతృప్తి చెందరు. అతను పచ్చి చేప లాంటి వాడు. బండకేసి పులస మొత్తం తీసేస్తారు.
నేను ఎందుకు వచ్చానా అని వాడు ఫీలయ్యేలా చేస్తాడు రాజమౌళి. ప్రతి విలన్, హీరో కూడా ఆయనతో సినిమా చేసిన తర్వాత చాలా సంతోషపడతారో. రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని వివరిస్తారు. అయిన అర్ధం కాకపోతే ఆయనే యాక్ట్ చేసి చూపిస్తారు. అంత గొప్పోడు రాజమౌళి. మిగతావాళ్లు ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తారు అని రాజమౌళిని ఆకాశానికి ఎత్తాడు రాజీవ్.. ఇక మరో ప్రముఖ డైరెక్టర్ వినాయక్ తొందరగా షాట్ తీసి ఆర్టిస్టులను వెళ్లిపోమంటారని, ఆయనతో పని ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు యాక్టర్ల కాన్ఫిడెన్స్ ని బాగా బూస్ట్ చేస్తారు. స్క్రిప్ట్‌లో ఉన్నట్లుగా కాకుండా మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి అని అంటారు. అది బాగుంటే తీసుకుంటారు… లేదంటే అందులో ఆయనకు నచ్చినంత వరకు ఉంచి మళ్లీ షూట్ చేసుకుంటారు. ఆయన మేకింగ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది అని రాజీవ్ కనకాల అన్నారు
ఎదుటి వారు ఏం చేసినా నిరాశ పరచకుండా బాగుంది అంటారు. ఇంకాస్త బెటర్‌గా చేస్తే బాగుంటుందని చెబుతారు. ఆయన మాటలతో ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని రాజీవ్ అన్నారు. ఇక శేఖర్ కమ్ముల చాలా కూల్ గా వర్క్ చేయించుకుంటారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ములకి కోపం అనేది రాదు. తనకి కావల్సింది వచ్చేదాకా ఓపికగా ఉంటారు. మోహమాటంగా షూట్ చేస్తారని వెల్లడించారు. కాగా, రాజీవ్ నటించిన తెలుగు వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’ ఈ శుక్రవారమే అంటే ఏప్రిల్ 4న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కొడుకును విదేశాలకు పంపి, ఉన్నత చదువులు చదివించాలని కలలు కనే మిడిల్ క్లాస్ తండ్రి స్టోరీ ఆధారంగా నడుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు రాజీవ్.