Rajasekhar | చాలా రోజుల తర్వాత గరుడ వేగ సినిమాతో ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. అప్పట్నుంచి ఆచూతూచి కథలు ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో వచ్చిన కల్కి యావరేజ్‌గా నడిచింది. దీంతో గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ హీరో.. ఇప్పుడు తన సినిమాను సంక్రాంతి బరిలోకి దించుతున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ వాయిదా పడటంతో తన సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు.
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ తప్పుకోవడంతో చిన్న సినిమాలు పండుగ చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా విడుదల కాని చిన్ని సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అలా ఇప్పటికే ఏడు సినిమాలు సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో రాజశేఖర్ నటిస్తున్న శేఖర్ సినిమా కూడా చేరిపోయింది. ఇటీవల విడుదల చేసిన శేఖర్ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజశేఖర్ డిఫరెంట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాను పండుగకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన ఓ సినిమాకు రీమేక్‌గా శేఖర్ సినిమా వస్తుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకు నిర్మాత.