Rajamouli watched F1 with His Wife |దిగ్గజ దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి దంపతులు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ (PCX) లో ఉన్న ‘F1’ సినిమాను వీక్షించారు. ఆదివారం ప్రసాద్స్‌కి వెళ్లిన రాజమౌళి ఉదయం ‘F1’ సినిమాను వీక్షించినట్లు తెలుస్తుంది. సినిమా అయిపోయిన అనంతరం రాజమౌళి బయటకు వెళుతున్న వీడియోను ప్రసాద్ యాజమాన్యం తాజాగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ సినిమాను నటుడు విజయ్ దేవరకొండతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ చూడగా.. తాజాగా రాజమౌళి కూడా వీక్షించాడు.
సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అమెరికన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన చిత్రం F1. ఫార్ములా 1 రేసింగ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో డామ్సన్ ఇడ్రిస్, కెరీ కాండన్, జావియర్ బార్డెమ్, టోబియాస్ మెంజీస్, సారా నైల్స్, కిమ్ బోడ్నియా, సామ్సన్ కాయో తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
The legendary SS Rajamouli garu visited Prasads PCX to experience the thrill of #F1TheMovie on the big screen and he loved every second of it! 🙌🎬🏁#SSRajamouli #PCX #Prasads #F1Movie #HyderabadCinema #PrasadsMultiplex #PrasadsCinemas pic.twitter.com/sHwWSwS5Fq
— Prasads Multiplex (@PrasadsCinemas) July 20, 2025