Rajamouli|ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికైతే సోషల్ మీడియాలో ‘SSMB 29’ అనే పేరుతో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుండగా, ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఇటీవల ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. అవుట్ డోర్ లో మహేశ్, పృథ్వీరాజ్ లపై రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయగా, ఇందుకు సంబంధించిన వీడియో లీకైంది.
ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇక చిత్ర బృందం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది..మున్ముందు కూడా అవుట్ డోర్ షూట్స్ చేస్తే ఇలాంటి లీకులు తప్పవని భావించిన రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇకపై ఇండియాలో అవుట్ డోర్ షూటింగ్స్ చేయకూడదని డిసైడ్ అయ్యాడట. ఎంత సెక్యూరిటీ పెంచినా లీక్ ఏదో రూపంలో జరుగుతుందని, అందుకే ఇక్కడ ఔట్ డోర్ షూటింగ్స్ దాదాపు ఎవాయిడ్ చేయాలని అనుకుంటున్నాడట. కాశీలో తదుపరి షెడ్యూల్ జరగనుండగా, దాని కోసం ఏకంగా భారీ సెట్ నిర్మించి అందులోనే మూవీ చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో భారీ కాశీ సెట్ కూడా రెడీ చేసారని టాక్.
అడ్వెంచర్ యాక్షన్ మూవీ అయినా ఈ సినిమాలో కాశీ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్తితుల్లో అవుట్ డోర్ షూట్స్ చెయ్యడం చాలా కష్టమని తేల్చింది టీమ్.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని ఉద్దేశిస్తూ ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. గతంలో మల్కాన్‌గిరిలో ‘పుష్ప-2’ షూటింగ్ జరిగింది. ఇప్పుడు మహేష్ -రాజమౌళి చిత్రం కోరాపుట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఒడిశాలో సినిమా షూటింగ్స్ కోసం అనువైన సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌ల సంపద ఉందని ఇవి రుజువు చేస్తున్నాయి. ఇది ఒడిశా పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ప్రైమ్ షూటింగ్ డెస్టినేషన్ గా మారుతుంది. మేము అన్ని చిత్ర పరిశ్రమలను స్వాగతిస్తున్నాము. షూటింగ్స్ కు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాము అంటూ ప్రవతి పరిద తన పోస్ట్ లో పేర్కొంది.