ఆర్ఆర్ఆర్ లోని ఆ ఒక్క సీన్ కోసం.. రాజమౌళి అన్ని వేల టేకులు తీసుకున్నాడట..!
రాజమౌళి సినిమాల్లో ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్లకు ప్రత్యేకించి అభిమానులుంటారు. ఒక సినిమాకు ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను ఏ రేంజ్లో తెరకెక్కిస్తే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారో రాజమౌళి కంటే బాగా ఎవరికి తెలియదు అనే రీతిలో ఎపిసోడ్‌ను రూపొందిస్తాడు.
RRR Movie | ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట లిఖించుకుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది.
రాజమౌళి సినిమాల్లో ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్లకు ప్రత్యేకించి అభిమానులుంటారు. ఒక సినిమాకు ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను ఏ రేంజ్లో తెరకెక్కిస్తే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారో రాజమౌళి కంటే బాగా ఎవరికి తెలియదు అనే రీతిలో ఎపిసోడ్‌ను రూపొందిస్తాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్లోనూ ప్రీ ఇంటర్వెల్ సీన్‌కు గూస్బంప్స్ తెప్పించాడు. అలా సాగిపోతున్న సినిమాను ఇంటర్వెల్ సీన్‌తో వేరే లెవల్‌కు తీసుకెళ్ళాడు. జంతువులతో పాటు తారక్ ట్రక్‌లో నుండి బయటకు వచ్చే సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ సీన్ కోసం చిత్రబృందం ఎంత కష్ట పడ్డారో జక్కన్న తాజాగా వెల్లడించాడు.
ఈ సీన్‌ను సక్సెస్ ఫుల్‌గా షూట్ చేసేందుకు ఏకంగా 40రాత్రల సమయం పట్టిందని జక్కన్న తెలిపాడు. అంతేకాకుండా ఈ సీన్ కోసం దాదాపు 2000 టేకులు తీసుకున్నాడట. దీన్ని బట్టి చూస్తే జక్కన్న ఎంత పర్ఫెక్షనిస్ట్ అనేది తెలుస్తుంది. రాజమౌళి తను అనుకున్నది వచ్చేంత వరకు దాన్ని విడిచిపెట్టడు అని ఈయనతో కలిసి పనిచేసిన నటీ నటులు ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు సినిమా కోసం సిద్ధమౌతవున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.
Read Also:
S.S. Rajamouli | రాజమౌళికు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు..!
Allu Arjun | ఐకాన్ స్టార్‌పై బాలీవుడ్ దర్శకుడి కన్ను..!
Ram Setu Movie | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్‌సేతు మూవీ.. కానీ?
Varasudu Movie | వారసుడు మూవీ క్రేజీ అప్డేట్.. దళపతి ఫ్యాన్స్‌కు పండగే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

