Ram Setu Movie | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్‌సేతు మూవీ.. కానీ?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఓ భారీ హిట్టు కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది అక్షయ్ కుమార్‌కు అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. ఇప్పటివరకు ఈయన నటించిన ఐదు సినిమాలు రిలీజ్ కాగా
Ram Setu Movie On OTT | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఓ భారీ హిట్టు కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది అక్షయ్ కుమార్‌కు అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. ఇప్పటివరకు ఈయన నటించిన ఐదు సినిమాలు రిలీజ్ కాగా.. ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజైన రామ్‌సేతు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రిలీజ్‌కు ముందు మేకర్స్ విడుదల చేసిన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఫస్ట్ వీకెండ్ తర్వాత ఫుల్ డ్రాప్స్ పడ్డాయి. ఇక రిలీజైన రెండు వారాల్లోపే ఈ సినిమా థియేటర్లలో నుండి వెళ్లిపోయింది.
కాగా ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా గతరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ చిత్రం వారం రోజుల పాటు రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉండనుంది. ప్రైమ్ సబ్‌స్కిప్షన్ ఉన్న వాళ్ళు ఈ సినిమా చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ వెర్షన్లలోనూ స్ట్రీమింగ్ అవుతుంది.
యాక్షన్ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ పురావస్తు పరిశోధకుడిగా నటించాడు. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలకపాత్ర పోషించాడు. అక్షయ్‌కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ భారుచ్చా నటించారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

