S.S. Rajamouli | రాజమౌళికు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు..!
ఇండియా గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకడు. ఈయన పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. హీరోతో సంబంధంలేకుండా కేవలం ఈయన పేరుతోనే సినిమాకు వందల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది.
S.S. Rajamouli | ఇండియా గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకడు. ఈయన పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. హీరోతో సంబంధంలేకుండా కేవలం ఈయన పేరుతోనే సినిమాకు వందల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడు. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు ఇండియన్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేశాడు. రాజమౌళి టేకింగ్‌కు, విజన్‌కు హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్లు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాతో రాజమౌళి ఇప్పటికే ఎన్నో అవార్డులను సాధించాడు. కాగా తాజాగా ఈయన మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నాడు.
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC).. ఆర్ఆర్ఆర్ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి ఒక టాలీవుడ్ సినిమా ఈ ఘనత సాధించిందంటే రాజమౌళి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే ఇంగ్లీష్ పేపర్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించింది.
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషించాడు. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25న విడుదలై ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సంచలనం విజయం సాధించింది. ఓవరల్‌గా 1200కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రాజమౌళికి వరుసగా రెండోసారి 1000 కోట్ల క్లబ్లో నిలిచిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
. @SSRajamouli wins the prestigious New York Film Critics Circle Award for the Best Director! @NYFCC
Congratulations #SSRajamouli & team #RRRMovie. May you win many more awards… pic.twitter.com/V5QZZgg4yb
— BA Raju’s Team (@baraju_SuperHit) December 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

