Varasudu Movie | వారసుడు మూవీ క్రేజీ అప్డేట్.. దళపతి ఫ్యాన్స్‌కు పండగే..!
కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దళపతి విజయ్. 'తుపాకి' నుండి 'బీస్ట్' వరకు ఈయన నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో రిలీజవుతూ వస్తున్నాయి
Varasudu Movie Second Single | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దళపతి విజయ్. ‘తుపాకి’ నుండి ‘బీస్ట్’ వరకు ఈయన నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో రిలీజవుతూ వస్తున్నాయి. ఇక ఈ సారి నేరుగా తెలుగు సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వారసుడు. తమిళంలో వారిసు పేరుతో తెరకెక్కుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్‌ను డిసెంబర్ 4 సాయంత్రం 4గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అయితే సెకండ్ సింగిల్ కూడా ముందుగా తమిళంలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ‘రంజితమే’ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ పాటకు 78మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇటీవలే ఈ పాట తెలుగు వెర్షన్ కూడా రిలీజైంది.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, నిర్మిస్తున్నారు. ద్విభాషా సినిమాగా రూపొందిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం.
#VarisuSecondSingle – #TheeThalapathy 🔥
THE BOSS is all set to arrive on Dec 4th at 4PM 💥#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @TSeries #BhushanKumar #KrishanKumar #ShivChanana #Varisu #VarisuPongal#30YearsOfVijayism pic.twitter.com/bpZIjNRLq4— Sri Venkateswara Creations (@SVC_official) December 2, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

