Rajamouli| ఈ మధ్య కాలంలో మూవీ షూటింగ్ లొకేషన్స్ విజువల్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. చిత్ర బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా లీక్ అవుతున్నాయి. తాజాగా మహేష్ -జక్కన్న కాంబోలో రూపొందే మూవీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో భారీ యాక్షన్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పుడు మెయిన్ కాస్టింగ్ పాల్గొంటుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుండగా, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
అయితే తాజాగా మహేష్ బాబు, రాజమౌళి సినిమా నుంచి కీలక సన్నివేశానికి సంబంధించిన వీడియో రిలీజ్ అయింది. అడవి ప్రాంతంలా కనిపిస్తుండగా, అక్కడ ఓ వ్యక్తి వీల్ ఛైర్లో ఉన్నారు. కొందరు ప్రైవేట్ సెక్యూరిటీ మహేష్ బాబుని పట్టుకుని ఆయన ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్ తనదైన స్టయిల్లో నడుచుకుంటూ రాగా, ఓ సెక్యూరిటీ అతను మహేష్ బాబుని కింద కూర్చో పెట్టి వెనక చేతులు పెట్టమని ఆదేశించాడు. వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి విలన్ అని తెలుస్తుండగా, అతనే పృథ్వీరాజ్ సుకుమారన్ అని అందరు అనుకుంటున్నారు. ఈ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
అయితే ఇందులో మహేష్ లుక్ ఊరమాస్‌గా కనిపిస్తుంది. లీకైన వీడియోనే ఇలా ఉంటే థియేటర్లో ఇలాంటి ఎన్ని సీన్స్ మనకు మంచి ఫీస్ట్ అందిస్తాయో అని ప్రతి ఒక్కరు ముచ్చటించుకుంటున్నారు. అయితే రాజమౌళి సినిమా టైట్ సెక్యూరిటీ మధ్య నడుస్తుంది. సెట్లోకి సెల్‌ఫోన్ కూడా అనుమతించారు. అలాంటిది వీడియో ఎలా లీక్ అయింది అని ఆలోచనలు చేస్తున్నారు. అయితే దీనిపై జక్కన్న టీమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.ఇక ఈ సినిమా ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని, మహేష్ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.