Raja Saab | కల్కి చిత్రం తర్వాత ప్రభాస్ నుండి మరే చిత్రం రాలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా డార్లింగ్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. అదుగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని ఊరిస్తున్నారే తప్ప మూవీకి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. అయితే ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకి ప్రమోషన్స్ పరంగా ఒక అడుగు ముందుకేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు టీజర్ రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారట. తమన్ రీ రికార్డింగ్ మొదలుపెట్టేశాడు. మే నెల మధ్యలో టీజర్ లాంచ్ ఉంటుందని తెలుస్తుంది.
అయితే టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా లేదా అనేది సందేహంగా మారింది. ప్రస్తుతానికి డేట్ లేకుండా వీడియో సిద్ధం చేస్తున్నారని, ప్రభాస్ త్వరగా తన బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. లేదంటూ కమింగ్ సూన్ అనే వేస్తారు. ప్రభాస్ తిరిగి వచ్చి బ్యాలన్స్ షూట్ కు సంబంధించిన కాల్ షీట్ల క్లారిటీ ఇస్తే అందులో పొందుపరుస్తారని, లేదంటే కమింగ్ సూన్ తప్ప ఇంకేం ఉండదని అంటున్నారు. ముందుగా ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ, అన్నీ అనుకున్నట్లు జరగకపోవడంతో సినిమాని వాయిదా వేశారు.
అయితే త్వరలో విడుదల కానున్న టీజర్ లో అదిరిపోయే కంటెంట్, విజువల్స్, వింటేజ్ ప్రభాస్ లుక్స్ అన్ని చూపించి ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడట మారుతి. అయితే 2025 ప్రధానమైన డేట్లన్నీ ఒక్కొక్కరుగా బ్లాక్ చేసుకుంటూ పోతుండగా, రాజాసాబ్ ఏ డేట్ లాక్ చేస్తాడా అని మిగతా నిర్మాతలు కూడా అయోమయంలో ఉన్నారు. రాజాసాబ్‌కి పోటీగా దిగితే చిన్న సినిమాలు నష్టపోతాయి. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరగా అనౌన్స్ చేస్తే మిగతా నిర్మాతలు వారి సినిమాలని కూడా హ్యాపీగా అనౌన్స్ చేసుకునే అవకాశం ఉంది. మే వరకు వేచి చూస్తే ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది. రాజా సాబ్ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ ఓ ప్రధాన పాత్ర పోషించాడు.