Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన సినిమాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన హీరోల్లో ప్రభాస్ కీలక పాత్ర పోషించారు. యాక్షన్, మాస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇటీవల పూర్తిగా భిన్నమైన జానర్‌తో ‘రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంతో రూపొందించబడింది. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రభాస్ వింటేజ్ లుక్, ఎంటర్టైనింగ్ పాత్ర అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. జనవరి 9న థియేటర్లలో విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
అయితే యాక్షన్ ఇమేజ్‌కు భిన్నంగా, హాస్యం, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కనిపించిన ప్రభాస్‌ను చూసి చాలా మంది ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. థియేటర్లలో స్పందన ఎలా ఉన్నా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘రాజా సాబ్’ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషల్లో స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ.80 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ ఒప్పందం ప్రభాస్ మార్కెట్‌ను మరోసారి రుజువు చేస్తోందని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ‘రాజా సాబ్’ను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓటీటీ ద్వారా ‘రాజా సాబ్’కు మంచి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఫౌజీ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.