Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దర్శకుడు మారుతీ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘రాజా సాబ్’. భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించగా, రాజా సాబ్ టీజర్ ను జూన్ 16న ఉదయం 10:52 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ప్రభాస్, మారుతీ, థమన్, రామజోగయ్య శాస్త్రి కలిసి మ్యూజిక్ రూమ్ లో కూర్చొని నవ్వుతున్న పిక్ షేర్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు. కానీ రాబోయేది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనే క్యాప్షన్ యాడ్ చేసింది. ఈ పిక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
డిసెంబరు 5న రాజా సాబ్ సినిమాని థియేటర్ లో తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ శివార్లో చిత్రీకరించారు. ప్రభాస్ తొలిసారిగా థ్రిల్లర్ సినిమాలో నటిస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మారుతి తన మార్క్ తో ఒకవైపు నవ్విస్తూనే, మరోవైపు భయపెట్టేవిధంగా కథను రాసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, రీసెంట్గా చిత్ర టీజర్ లీక్ అయింది. లీక్ అయిన టీజర్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వెంటనే ‘రాజా సాబ్’ టీమ్ అప్రమత్తమైంది. టీజర్ ఎలా లీక్ అయ్యిందనే దానిపై మేకర్స్ లోతుగా ఆరా తీస్తున్నారు.
వీడియోను మరింత విస్తృతంగా వ్యాప్తి చెందకుండా తక్షణమే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనపై మేకర్స్ అధికారికంగా స్పందించారు. ‘రాజా సాబ్’ మూవీ టీం ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ హెచ్చరిక విడుదల చేస్తూ, ఈ చిత్రానికి సంబంధించిన ఏదైనా లీక్ వీడియోలు లేదా కంటెంట్‌ను పంచుకుంటే సంబంధిత సోషల్ మీడియా అకౌంట్లు సస్పెండ్ చేయబడతాయి. అలాగే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. అభిమానులు, ప్రేక్షకులు ఈ విషయంలో సహకరించాలని, తర్వలోనే బాధ్యతాయూతంగా సెలబ్రేట్ చేసుకొందాం అని పేర్కొన్నారు.