అగ్ర హీరో ప్రభాస్ నాన్‌స్టాప్ షెడ్యూళ్లతో వరుసగా తన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఫౌజీ’ ‘ది రాజా సాబ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరులో ‘స్పిరిట్’ సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ది రాజాసాబ్’ షూటింగ్ షెడ్యూల్స్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. సోమవారం హైదరాబాద్‌లో మొదలైన తాజా షెడ్యూల్లో ప్రభాస్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. దీని తర్వాత సెప్టెంబర్‌లో కేరళలో ప్రభాస్ ఉపోద్ఘాత గీతాన్ని చిత్రీకరిస్తారని చెబుతున్నారు. రెండు పాటల్ని విదేశాల్లో తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని, దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిసింది. హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ షూట్లో జాయిన్ కాబోతున్నారు.