ఈ వారం సినిమాల పరిస్థితేంటి.. చోరుడు మనసు దోచాడా..?
సాధారణంగా శుక్రవారం రోజు కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఒకరోజు ముందుగానే అంటే గురువారమే కొత్త సినిమాలు వచ్చేశాయి. ఆగస్ట్ 19న రెండు సినిమాలు విడుదలయ్యాయి.

సాధారణంగా శుక్రవారం రోజు కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఒకరోజు ముందుగానే అంటే గురువారమే కొత్త సినిమాలు వచ్చేశాయి. ఆగస్ట్ 19న రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో శ్రీ విష్ణు నటించిన రాజ రాజ చోర కూడా ఉంది. ఈ వారం కాస్తో కూస్తో అంచనాలున్న సినిమా ఇదొక్కటే. దీనికి కూడా ఓపెనింగ్స్ వస్తాయనే భరోసా లేదు కానీ శ్రీ విష్ణుపై నమ్మకం మాత్రం ప్రేక్షకుల్లో ఉంది. గతంలో ఈయన నటించిన కొన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేశాయి కూడా.
ఆ నమ్మకంతోనే ఇప్పుడు మరోసారి కొత్త దర్శకుడితో రాజ రాజ చోర సినిమా చేశాడు శ్రీ విష్ణు. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది. సినిమాను ఒకరోజు ముందుగానే ప్రీమియర్ కూడా వేశారు దర్శక నిర్మాతలు. అక్కడ్నుంచే టాక్ బాగా వచ్చింది. ఇక విడుదలైన తర్వాత కూడా పర్లేదనే టాక్ తెచ్చుకుంది రాజ రాజ చోర. సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉందని.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం గురించి చాలా బాగా చూపించారని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయితే లేవు.
చాలా చోట్ల కనీసం 25 శాతం ప్రేక్షకులు కూడా హాలు వైపు రాలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మార్నింగ్ షోల పరిస్థితి ఇలా ఉంది. దీంతో పాటు విడుదలైన శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా అసలు వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక కలెక్షన్స్ మాట దేవుడెరుగు. మొత్తానికి ఈ వారం ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలకు ఊహించిన కలెక్షన్స్ అయితే రావడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
క్రేజీ అప్ డేట్..సత్యదేవ్ భార్యగా నయనతార !
బాలకృష్ణ మూవీ ఆఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో..!
రియా చక్రవర్తి భావోద్వేగ సందేశం..నెట్టింట్లో వైరల్
Raja Raja Chora | ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

