Raja Delux Movie | ప్రభాస్-మారుతి మూవీ సీజీ వర్క్ అన్ని కోట్లా?
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ డ్రామా ఒకటి. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.
Prabhas- Maruthi Movie | ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ డ్రామా ఒకటి. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఎలాంటి సందడి లేకుండా లో ప్రొఫైల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలోని సీజీ వర్క్ కోసమే దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమాలో సీజీ వర్క్‌కు ఎక్కువ ప్రధాన్యత ఉందట. అందుకోసమే మేకర్స్ అంత ఖర్చు చేస్తున్నారట. ఇక ఇప్పటికే రామోజీ ఫిలింస్ సిటీలో రూ.6 కోట్లతో ఒక పెద్ద సెట్ నిర్మించారు. ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ 100రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చినట్లు టాక్.
హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డిలక్స్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టు తిరిగే తాతా-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందట. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటివరకు ఏ స్టార్ హీరోతో సినిమా చేయని మారుతి.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో సినిమా చేస్తుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒకంత భయంగానే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా మారుతి తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ను మారుతి హాండిల్ చేస్తాడా అనే డౌట్ అభిమానుల్లో మెదులుతుంది.
Read Also:
Adivi Sesh Movie | కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన అడివిశేష్..!
Jr.Ntr | మెగా మేనల్లుడి కోసం జూ.ఎన్టీఆర్ ఆ పని చేయబోతున్నాడా?
RRR Movie | తారక్ చిన్న కరెక్షన్.. రాజమౌళి ట్వీట్ వైరల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

