RRR Movie | తారక్ చిన్న కరెక్షన్.. రాజమౌళి ట్వీట్ వైరల్..!
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలలో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. 'బాహుబలి' తర్వాత జక్కన్న చెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న రిలీజైంది. మొదటి రోజు నుండి ఈ సినిమా కలెక్షన్ల వేట కొనసాగించింది. 'బాహుబలి-2' పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.
Jr.Ntr Wishesh to Rajamouli | ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న చెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న రిలీజైంది. మొదటి రోజు నుండి ఈ సినిమా కలెక్షన్ల వేట కొనసాగించింది. ‘బాహుబలి-2’ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. బాహుబలితో టాలీవుడ్ స్థాయిని పెంచిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్తో ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్‌కి తీసుకెళ్ళాడు. రాజమౌళి టేకింగ్, విజన్‌కు హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఈ క్రమంలో హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును రాజమౌళి అందుకున్నాడు. తాజాగా అమెరికాలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డును గెలుచుకున్నాడు.
అవార్డు గెలుచుకోవడంతో రాజమౌళికు సినీ సెలబ్రెటీలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తారక్ కూడా రాజమౌళికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపాడు. ‘కంగ్రాట్స్ జక్కన్న, మీ కీర్తి ప్రపంచవ్యాప్తం కావడానికి ఇది ఆరంభం మాత్రమే. ఇన్నేళ్ళ మన జర్నీలో మీ గురించి నాకు తెలిసినదంతా ప్రపంచానికి కూడా తెలియాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ట్వీట్ చేశాడు. దీనిపై రాజమౌళి స్పందించి ‘తారక్ చిన్న కరెక్షన్. ఇది మన ప్రయాణానికి ఆరంభం’ అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో ఈ రెండు పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్తో రాజమౌళితో పాటు తారక్, చరణ్‌లకు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషించాడు. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25న విడుదలై ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సంచలనం విజయం సాధించింది. ఓవరల్‌గా 1200కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రాజమౌళికి వరుసగా రెండోసారి 1000 కోట్ల క్లబ్లో నిలిచిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
Haha. Small correction Tarak… Beginning of *OUR JOURNEY..:) https://t.co/ZFBQFmMlp8
— rajamouli ss (@ssrajamouli) December 3, 2022
Read Also:
“S.S.Rajamouli | రాజమౌళి సినిమాలు ఎందుకంత స్పెషల్‌గా ఉంటాయి!”
“S.S Rajamouli | రాజమౌళి ఒక్కో సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?”
“S.S. Rajamouli | రాజమౌళికు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు..!”
“ఆర్ఆర్ఆర్ లోని ఆ ఒక్క సీన్ కోసం.. రాజమౌళి అన్ని వేల టేకులు తీసుకున్నాడట..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

