Jr.Ntr | మెగా మేనల్లుడి కోసం జూ.ఎన్టీఆర్ ఆ పని చేయబోతున్నాడా?
రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ రెట్టింపు ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు.
SDT15 Movie | ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది సాధరణ విషయమే. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు తమ సహా హీరో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. మహేష్‌బాబు, నాగార్జున, రామ్, ప్రభాస్, రవితేజ ఇలా పలువురు స్టార్లు తన సహా నటుల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఇటీవలే చిరు బ్రహ్మస్త్ర ట్రైలర్‌కు గొంతును ఇచ్చాడు. కాగా ఇప్పుడు ఓ స్టార్ హీరో ఒక యంగ్ హీరో సినిమా టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ఇంతకు ఎవరా హీరో అనుకుంటున్నారా. ఆ హీరోలు మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ టీజర్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మేకర్స్ తారక్‌ను సంప్రదించినట్లు, త్వరలోనే టీజర్ డబ్బింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ రెట్టింపు ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ సినిమాను సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుంది. దీనితో పాటుగా తాజాగా సాయిధరమ్ తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

