Raj tarun Anubhavinchu Raja | ఒకటి రెండూ కాదు అరడజన్ ఫ్లాపులు వచ్చిన తర్వాత కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరో రాజ్ తరుణ్. నవంబర్ 26న ఈయన అనుభవించు రాజా సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్ సినిమాపై అంచనాలు బాగానే పెంచేశాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమా ఇప్పుడు రాజ్ తరుణ్ కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది.
హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన రాజ్ తరుణ్.. అదే జోరు చూపించడంలో బొక్క బోర్లా పడ్డాడు. మంచి అంచనాలతో వచ్చిన సినిమాలు దారుణంగా నిరాశపరచడంతో రాజ్ తరుణ్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. వరస సినిమాలు చేస్తున్నా కూడా ఆయన కోరుకున్న విజయం రావడం లేదు. అప్పుడెప్పుడో 2015లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత ఈయన నటించిన ఏ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. మధ్యలో ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు మాత్రం పర్లేదనిపించాయి. అప్పటి నుంచి అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ హిట్స్ మాత్రం రావడం లేదు.
ప్రస్తుతం ఈయన స్టాండప్ రాహుల్, అనుభవించు రాజా సినిమాలలో నటిస్తున్నాడు. కామెడీ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ కెరీర్ ఈ రెండు సినిమాలపైనే ఆధారపడి ఉంది. అటు స్టాండప్ రాహుల్.. ఇటు అనుభవించు రాజా.. కచ్చితంగా తను కోరుకున్న విజయాలు తీసుకొస్తాయని నమ్ముతున్నాడు ఈ హీరో. వీటిలో అనుభవించు రాజా ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండటం విశేషం. నాగార్జున మేనకోడలు సుప్రియ ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. మరి వీటితో రాజ్ తరుణ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
kgf – kaikala satyanarayana | కేజీఎఫ్ సినిమాతో కైకాల కు సంబంధమేంటి?
ఆది, రాజ్ తరుణ్ లకు ఆఫర్స్ ఎలా వస్తున్నాయ్
రాజ్ తరుణ్.. సూపర్ సుడిగాడు ఆఫ్ టాలీవుడ్..
తాతయ్య నుంచి అదే నేర్చుకున్నా!