Jugaari Cross | యాక్టర్‌గా, దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మాతగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన కన్నడ స్టార్ సెలబ్రిటీల్లో ఒకరు రాజ్ బీ శెట్టి. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ వన్ ఆఫ్ ది కీ రోల్లో కరవాలి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదల కాకముందే మరో సినిమాను ప్రకటించాడు రాజ్ బీ శెట్టి. ఈ క్రేజీ యాక్టర్ కమ్ డైరెక్టర్ నటిస్తోన్న చిత్రం జుగారి క్రాస్ (Jugaari Cross) .
పాపులర్ రైటర్ పూర్ణచంద్ర తేజస్వి ప్రసిద్ద నవల జుగారి క్రాస్‌ను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. గురుదత్త గనిగ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజ్బీ శెట్టి వన్ ఆఫ్ దిలీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ లుక్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. పుర్రెలు, పారుతున్న రక్తం, మారణాయుధాలు వంటి విజువల్స్, అదిరిపోయే బీజీఎంతో కట్ చేసిన టైటిల్ ప్రోమో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం.
ఇప్పటికే గురుదత్ గనిగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కరవాలి నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రాజ్ బీ శెట్టి ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్‌ను షేర్ చేయగా… రాజ్ బీ శెట్టి రెండు దున్నల మధ్య నిలబడి చేతిలో కాగడ పట్టుకుని లుక్ హైప్ క్రియేట్ చేస్తుంది.
Versatile actor @RajbShettyOMK teams up again with @gurudath_ganiga for #JugaariCross, an ambitious adaptation of #PoornachandraTejaswi’s iconic novel@GuruGanigaFilms@pinkticketsoff@pavithrabgowda@gshruthikrishna#jugaricross #kppoornachandratejaswi #poornachandratejaswikp… pic.twitter.com/3CpBtrjNLE
— BA Raju’s Team (@baraju_SuperHit) October 17, 2025