Jabardasth Raising Raju| తెరపై మనల్ని నవ్వించే కమెడీయన్స్ నిజ జీవితంలో ఎన్నో విషాద సంఘటనలు ఉన్నాయి. వెండితెరపై, బుల్లితెర కమెడీయన్స్ జీవితాలలో చాలా కష్టాలు ఉన్నాయి. జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు బుల్లితెర ప్రేక్షకులకి చాలా సుపరిచితం. చాలా ఏళ్ల నుంచే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. తొలుత పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ పోషించిన రైజింగ్ రాజు తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హైపర్ ఆది తో కలిసి టీమ్ లీడర్ గా వందలాది స్కిట్లు చేసిన ఆయన అడపాదడపా సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ టీవీ షోకి హాజరైన రైజింగ్ రాజు తన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ముఖ్యంగా తన కూతురి పెళ్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘నేను జబర్దస్త్‌కి వెళ్లకముందు నా బిడ్డ పెళ్లి చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అయితే ఆ సమయంలో చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశారు. అప్పుడు నా తోటి స్నేహితులు రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ ఇలా కొందరు తలా ఓ ఐదు వేలు ఇచ్చారు. ఆ డబ్బులతోనే నా కూతురి పెళ్లి చేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రైజింగ్ రాజు. రైజింగ్ రాజు చాలా ఏళ్ల నుంచే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమాల్లో చిన్న చిన్నపాత్రలు చేశాడు.
రైజింగ్ రాజుకి ఎప్పటి నుండో గుర్తింపు రాలేదు. డబ్బులు కూడా అంతంతమాత్రంగానే వచ్చేవి. దాంతో ప్యామిలీ పోషణ అతనికి భారంగా మారడంతో ఆ సమయంలో జబర్ధస్త్ అతనికి లైఫ్ ఇచ్చింది. జబర్థస్త్ లో డిఫరెంట్ కామెడీతో రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను హైపర్ ఆది తో కలిసి టీమ్ లీడర్ గా అద్భుతమైన స్కిట్లు చేశాడు రాజు. తన జీవితంలో హైపర్ ఆది దేవుడిలా వచ్చాడు అని ఎప్పుడు నన్ను కనిపెట్టుకుని ఉన్నాడని రాజు పేర్కొన్నాడు. స్కిట్లు చేసినా చేయకపోయినా పేమెంట్ మాత్రం ఇంటికి పంపించేవాడు అంటూ చెప్పుకొచ్చారు రాజు . అంతే కాదు కరోనా టైమ్ లో ఆర్దికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమయంలో నాకు మనవడు పుట్టాడు. అప్పుడు బయట వెళ్లే పరిస్థితి లేదు. ఆ టైమ్ లో కూడా హైపర్ ఆది నెల నెల ఇంటికి డబ్బులు పంపించేవాడు. ఆర్ధికంగా నిలబడేలా చేశాడు అని చెపుతూ ఎమోషనల్ అయ్యాడు రాజు. ప్రస్తుతం రాజు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.