Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంపౌండ్ నుంచి వస్తోన్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తుండగా..శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా నెట్టింటిని షేక్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో బ్లాస్టింగ్ స్టిల్ షేర్ చేశారు మేకర్స్. ‘ఇది మొదలవుతుంది.. ఆనందంతో మీ చేతులను పైకెత్తి మా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చీర్స్ చెప్పండి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలిసి భారీ ఫీస్ట్‌తో త్వరలో మీ ముందుకు రాబోతున్నారు..’ అంటూ హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ టీం హ్యాండ్ రైజ్ చేస్తున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎలాంటి బ్లాస్ట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ రెడీ అయింది. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ సెస్నేషనల్ లిరిక్స్‌తో పవన్ స్టార్ మేనరిజాన్ని మరోసారి చూపించబోతుంది. వేచి ఉండండి.. అంటూ ఇప్పటికే ఫొటోలు షేర్ చేసింది హరీష్ శంకర్ టీం. భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. రిలీజ్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Patang Movie | ఓటీటీలోకి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘పతంగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
MK Stalin | హిందీకి తమిళనాడులో స్థానం లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదు : సీఎం స్టాలిన్
Nayanthara | మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియాట్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్