సైన్మా షార్ట్ ఫిల్మ్‌తో తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు హైదరాబాదీ యాక్టర్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). మీడియా రంగం నుంచి సినిమా రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ నటుడు అర్జున్ రెడ్డి సినిమాలో పోషించిన శివ పాత్రతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ..తక్కువ టైంలోనే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించే అరుదైన అవకాశం కొట్టేశాడు. కామెడీ రోల్స్ తోపాటు పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ.
ఈ క్రేజీ కమెడియన్ ఫైనల్‌గా బ్యాచ్ లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యాడు (Tollywood). కాబోయే భార్య బిందును లిప్‌లాక్ (Rahul Bindu Liplock) చేసిన స్టిల్‌ను నెట్టింట షేర్ చేస్తూ..ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఈ ఇద్దరూ సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామనుకున్నారట. కానీ రాహుల్, ఇందు ఓ పార్టీలో కలుసుకున్నారు. అప్పుడే ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారని టాక్. కోవిడ్ ఎఫెక్ట్‌కు ముందే తన ప్రేయసి బిందును పెళ్లి చేసుకోవాలనుకున్నాడట.
వ్యక్తిత్వపరమైన లేదా వృత్తిపరమైన లక్షణాలు కావచ్చు..మాకు సాధారణంగా ఉంది..మేము అప్పటికపుడు వెంటనే క్లిక్ మనిపించాం..అంటూ లిప్ లాక్ స్టిల్ గురించి రాసుకొచ్చాడు రాహుల్ రామకృష్ణ. ఈ యువ నటుడు చాలా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సాధారణంగా బయటపెట్టకుండా..ప్రైవసీని మెయింటైన్ చేస్తుంటాడు. ఇలా సడెన్‌గా తన ఫియాన్సీతో కలిసి ఫొటో పెట్టి అందరికీ షాకిచ్చాడు రాహుల్ రామకృష్ణ.
మొత్తానికి ఫైనల్ గా ఓ ఇంటివాడు కాబోతున్న రాహుల్ రామకృష్ణకు విషెస్ చెబుతున్నారు మూవీ లవర్స్, ఫాలోవర్స్. మరి వెడ్డింగ్ ఎప్పుడనేదానిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్‌తో క్లారిటీ రానుంది.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022