Raghava Lawrence | నాలుగు నెలలు వాయిదా పడిన లారెన్స్ సినిమా.. కారణం ఎంటంటే?
Lawrence Latest Movie Post Poned | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కేవలం కొరియాగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నటుడిగా పలు విభాగాల్లో పనిచేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
Lawrence Latest Movie Post Poned | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కేవలం కొరియాగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నటుడిగా పలు విభాగాల్లో పనిచేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లారెన్స్ నటుడుగా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘రుద్రన్’ మూవీ ఒకటి. తెలుగులో ‘రుద్రుడు’ పేరుతో విడుదల కానుంది. కదిరేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
‘రుద్రుడు’ సినిమాను ముందుగా అనుకున్న తేదీ కాకుండా నాలుగు నెలలు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. కానీ, వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కేటాయించాల్సి రావడంతో రుద్రుడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 14న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రంలో లారెన్స్‌కు జోడీగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం లారెన్స్ ‘చంద్రముఖి’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. పీ. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది. దీనితో పాటుగా ‘అదిగారమ్’, ‘దుర్గ’ సినిమాలను కూడా చేస్తున్నాడు. ఇక దర్శకుడిగా ‘కాంచనా’ సిరీస్‌లోని నాల్గవ భాగాన్ని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది.
Read Also:
The Ghost | ‘శివ’ సెంటిమెంట్ ‘ది ఘోస్ట్’ చిత్రానికి వర్కవుట్ అవుతుందా?
Jr. Ntr | రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ?
Karthikeya-2 | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కార్తికేయ-2’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Ponniyin Selvan-1 | ‘పొన్నియన్ సెల్వన్’ నటులకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరికి అన్ని కోట్లా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

