The Ghost | ‘శివ’ సెంటిమెంట్ ‘ది ఘోస్ట్’ చిత్రానికి వర్కవుట్ అవుతుందా?
The Ghost Movie | అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఆరు పదుల వయసులోనూ యాక్షన్ సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు సవాళ్ విసురుతున్నాడు. ఈ ఏడాది 'బంగార్రాజు'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన నాగార్జున అదే జోష్‌లో 'ది ఘోస్ట్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
The Ghost Movie | అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఆరు పదుల వయసులోనూ యాక్షన్ సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు సవాళ్ విసురుతున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన నాగార్జున అదే జోష్‌లో ‘ది ఘోస్ట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ‘గురుడ వేగ’ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. అయితే అదే రోజున ౩౩ఏళ్ల క్రీతం టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’ విడుదలైంది.
నాగార్జున ఫిల్మోగ్రఫీలో శివ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పుడప్పుడే హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జునకు.. శివ చిత్రం కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ ఇచ్చింది. నాగార్జునను స్టార్ హీరోగా నిలబెట్టింది. అంతేకాకుండా టాలీవుడ్ సినిమాను శివకు ముందు శివ తర్వాత అనేలా ట్రెండ్‌ను సెట్ చేసింది. అప్పటివరకు టాలీవుడ్లో ఎవరు టచ్ చేయని గ్యాంగ్‌స్టర్ జానర్ కథతో నాగార్జున బ్లాక్‌బస్టర్ సాధించాడు. ఈ సినిమాలోని సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికి ట్రెండింగ్‌లోనే ఉంది. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. అప్పట్లోనే ఈ చిత్రం రూ.11 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా ఇప్పుడు శివ సెంటిమెంట్‌తో ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయనున్నాడు.
చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం కూడా అక్టబర్ 5నే విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా విపరీతమైన బజ్ ఉంది. అయినా కూడా నాగార్జున వెనక్కి తగ్గకుండా ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని అదే రోజున విడుదల చేస్తున్నాడు. ‘శివ’ సినిమాలాగే ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాడు. మరి శివ సెంటిమెంట్ ఈ చిత్రానికి కలిసి వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Also:
Ponniyin Selvan-1 | ‘పొన్నియన్ సెల్వన్’ నటులకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరికి అన్ని కోట్లా?
Raja Delux Movie | ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో?
Karthikeya-2 | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కార్తికేయ-2’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Ram Setu Movie | ఆసక్తి రేకిత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్ సేతు’ గ్లింప్స్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

