Raghava lawrence | ముప్పై ఏళ్ల క్రీతం ‘ముఠా మేస్త్రీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యాడు రాఘవలారెన్స్. ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’ అనే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసి తొలి పాటతోనే అందరితో విజిల్స్ వేయించుకున్నాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లతో టాలీవుడ్లో తిరుగులేని కొరియోగ్రాఫర్‌గా మారాడు. ఇదే క్రమంలో మెగాఫోన్ చేతబట్టి ‘మాస్’ సినిమాతో దర్శకుడి రూపం ఎత్తాడు. అక్కినేని అభిమానులకు మరిచిపోలేని హిట్టిచ్చాడు. ఆ తర్వాత హీరోగాను అవతారమెత్తి ‘స్టైల్’తో విజయ పరంపర కొనసాగించాడు. అయితే ‘ముని’ సిరీస్‌తో లారెన్స్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దెయ్యాల సినిమాలకు కేరాఫ్ ఆడ్రెస్గా మారాడు. అంతేకాదు ఆ సినిమాలతోనే లారెన్స్‌ను తిరుగులేని పాపులారిటీ వచ్చింది.
ఇక చాలా కాలం తర్వాత హార్రర్ జానర్ నుంచి బయటకు వచ్చి రుద్రన్ అనే మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. కథిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వారంలోనే తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. కాగా తాజాగా రిలీజైన ట్రైలర్‌ను గమినిస్తే లారెన్స్ పాత చింత పచ్చడితోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. కాకపోతే యాక్షన్ డోస్ మితీమిరినట్లు కనిపిస్తుంది. హీరోయిన్‌తో లవ్, ఆ తర్వాత పెళ్లి. హ్యపీగా సాగుతున్న హీరో జీవితంలోకి విలన్ ఎంటరవుతాడు. హీరోపై కోపంతో విలన్ హీరో భార్యను చంపేస్తాడు. ఇక భార్యను చంపడంతో విలన్ మీద ప్రతీకారం తీసుకోవడానికి హీరో రుద్రరూపం ఎత్తుతాడు. క్లైమాక్స్‌లో విలన్‌ను అంతమొందిస్తాడు.
ట్రైలర్‌ను చూసిన ప్రతీ ఒక్కరికీ ఇదే స్టోరీ మైండ్‌లో తడుతుంది. స్టోరీ మొత్తాన్ని ట్రైలర్లోనే చూపించారు. అంతేకాకుండా సైన్స్‌కు కూడా సవాళ్ విసిరే ఫైట్స్ ట్రైలర్లో కనిపించాయి. ఇలాంటి బొమ్మలను ఇప్పటికే కొన్ని వందల సార్లు చూసేశాం. మరీ ఈ సారి రుద్రుడు టీమ్ ఎదైనా కొత్తగా చూపిస్తుందో చూడాలి. లారెన్స్‌కు జోడీగా ప్రియాభవాని శంకర్ నటిస్తుంది. ఇక అదే రోజున శాకుంతలం సినిమా విడుదల కాబోతుంది. తమిళం వరకు ఓకే కానీ రుద్రుడుకి తెలుగులో మాత్రం గట్టి ఎదురు దెబ్బే. పైగా ఆ మరుసటి రోజు వెట్రిమారన్ విడుదల పార్ట్-1 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్‌ను అల్లు అరవింద్ పెద్ద లెవల్లోనే ప్లాన్ చేస్తున్నాడు. మరీ ఈ రెండు సినిమాల పోటీను తట్టుకుని లారెన్స్ నిలుస్తాడో లేదో చూడాలి.