రాఘవ లారెన్స్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రుద్రుడు’. కతిరేసన్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. లారెన్స్ సరసన ప్రియా భవానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఎంటర్టైన్మెంట్, రొమా న్స్, యాక్షన్ డ్రామా మేళవించి పక్కా కమర్షియల్ చిత్రంగా రూపొందించాం. రాఘవ లారెన్స్ పాత్ర చిత్రానికి హైలైట్గా ఉంటుంది. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు’ అన్నారు.