అందంతో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో రాణిస్తూ బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకుంది పరిణీతి చోప్రా. పన్నెండేండ్ల కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి యువతరంలో క్రేజ్‌ను సంపాదించుకుంది.
త్వరలో ఈ భామ పెళ్లి పీటలెక్కబోతున్నదని తెలిసింది. రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాతో ఈ భామ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నది. వీరిద్దరిరు కలిసి ముంబయిలో చాలా ఈవెంట్స్‌కు హాజరయ్యారు. అయితే తన ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు పరిణీతి. తాజా సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో ఈ జంటకు నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిసింది.
ఢిల్లీలో ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాటు జరుగుతున్నాయని చెబుతున్నారు. నిశ్చితార్థం కోసం పరిణీతి చోప్రా షూటింగ్స్‌ను వాయిదా వేసుసుంది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఛమ్కీలా, క్యాప్య్సుల్ గిల్ చిత్రాల్లో నటిస్తున్నది. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.