యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రాధే శ్యామ్ చిత్రం ఒకటి. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం నుండి టీజర్ విడుదల చేశారు.
నువ్ ఎవరో నాకు తెలుసు.. కానీ ఏది చెప్పను.. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు అది చెప్పను.. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నేను చెప్పను.. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను.. నాకు అన్నీ తెలుసు.. కానీ నేను ఏదీ చెప్పను. ఎందుకంటే అది మీ ఊహలకు కూడా అందదు..
నా పేరు విక్రమ్ ఆదిత్య.. నేను దేవుడిని కాదు. కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఆయన స్టైలిష్ లుక్స్‌కి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ పక్కన హీరోయిన్గా నటిస్తోంది. జనవరి 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.