ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రాధే శ్యామ్ చిత్రం ఒకటి. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్‌గా తీర్చిదిద్దారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ‘రాధే శ్యామ్’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యనున్నట్లు చెప్తూ.. ‘న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. అండ్ ఎ న్యూ రిలీజ్ డేట్’ అంటూ 2022 జనవరి 14న డేట్ ఫిక్స్ చేసేశారు.
డార్లింగ్ ప్రభాస్ కెరీర్లో మెమరబుల్ లవ్ స్టోరీగా గుర్తుండిపోయే ‘వర్షం’ మూవీ 2004లో జనవరి 14నే రిలీజ్ అయ్యింది.ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘రాధే శ్యామ్’ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా మూవీ నుండి పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. విక్రమాదిత్య, ప్రేరణ లవ్ లెస్సన్స్ నేర్పించేందుకు సిద్ధమయ్యారని మేకర్స్ చెబుతున్నారు. తాజగా విడుదలైన పోస్టర్‌లోను మూవీ సంక్రాంతికి విడుదల కానుందని ఉంది.