Radhe Shyam OTT | ‘రాధేశ్యామ్’ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో తీరిక లేకుండా షూటింగ్లలో గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన 'రాధేశ్యామ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి
Radhe Shyam On OTT | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో తీరిక లేకుండా షూటింగ్లలో గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన ‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. అభిమానుల నాలుగేళ్ళ నిరీక్షణకు థియేటర్‌కు వచ్చిన ప్రతి అభిమానిని ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరించింది. ప్రభాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఈ చిత్రంలో నటించాడు.
‘రాధేశ్యామ్’ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటివరకు ఈ చిత్రం 212.76 కోట్ల కలెక్షన్లను సాధించింది. ప్రభాస్‌కు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీని అమేజాన్ సంస్థ అఫీషియల్‌గా విడుదల చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 1 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. చిత్రం విడుదలకు ముందు యూవీ క్రియేషన్స్ విడుదలకు నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని డీల్ కుదిరించుకున్నారు. కానీ రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోతుంది. దాంతో ఈ చిత్రాన్ని పది రోజుల ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు యూవీ సంస్థతో అమేజాన్ మరో డీల్‌ను కుదిరించుకుందని సమాచారం.
Read also:
The Warrior | రవితేజకు పోటీగా రామ్ పోతినేని.. గెలుపు ఎవరిది?
Varun Tej | సిద్ధూ జోన్నలగడ్డ దర్శకుడితో.. వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
Ram Charan | ‘రామ్‌చరణ్ తేజ్’ బర్త్‌డే స్పెషల్
Kamal Haasan | గ్రామీణ నేపథ్యంలో కమల్‌హాసన్ తదుపరి సినిమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

