Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. దుబాయ్ షెడ్యూల్ హైదరాబాద్‌కు మార్పు!
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘రాకా’పై పూర్తి దృష్టి పెట్టారు. ఇతర సినిమాలకి డేట్స్ ఇవ్వకుండా, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా తరచూ ముంబైకి వెళ్లి వస్తున్న ఆయనకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘రాకా’పై పూర్తి దృష్టి పెట్టారు. ఇతర సినిమాలకి డేట్స్ ఇవ్వకుండా, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా తరచూ ముంబైకి వెళ్లి వస్తున్న ఆయనకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ‘రాకా’ చిత్రానికి సంబంధించిన ఓ కీలక షెడ్యూల్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని చిత్ర బృందం తొలుత ప్రణాళిక రూపొందించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ షెడ్యూల్‌ను హైదరాబాద్‌కు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ స్వస్థలం హైదరాబాద్ కావడంతో, నగరంలోనే షూటింగ్ జరగడం ఆయన ప్రయాణ సమయాన్ని తగ్గించనుంది. ముంబైకి వెళ్లి రావాల్సిన అవసరం కూడా కొంతవరకు తప్పుతుంది.
ఈ కీలక షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర ముఖ్య తారాగణం కూడా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. అయితే షెడ్యూల్ మార్పుపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’లో దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ, బబ్లూ పృథ్వీరాజ్, సిరి హనుమంతు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విశ్వానికి అతీతమైన కథాంశంతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌కు మారితే, తదుపరి చిత్రీకరణ మరింత సౌకర్యవంతంగా సాగేందుకు అవకాశం ఉంటుంది. ఈ సినిమా నుంచి రాబోయే అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- first look
- kaarthi
RELATED ARTICLES
తాజా వార్తలు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. దుబాయ్ షెడ్యూల్ హైదరాబాద్‌కు మార్పు!
Solar Pumpsets | వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు.. అధికారులకు రెడ్కో సీఎండీ కీలక ఆదేశాలు
Congress | రూ.6.91 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
Raj Gopal Reddy | మునుగోడుకు ఇదేం శాపం.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి!
Supreme Court | చార్జీలు ఎక్కువుంటే విమానంలో వెళ్లొద్దు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

