Pushpa2| అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో బన్నీకి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇక పుష్ప సినిమాకి సీక్వెల్‌గా పుష్ప2 అనే చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతీయ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై 100 రోజులు పూర్తి కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా ఒక వీడియోని విడుదల చేశారు.
‘ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పుష్ప 2 ది రూల్.. 100 డేస్. బాక్సాఫీస్ రికార్డ్ లు బద్దలు కొడుతూ.. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అంటూ ట్విటర్లో సుమారు 38 సెకెన్ల నిడివి ఉన్న వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ డైలాగ్స్‌లో కొన్నింటిని యాడ్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన సీక్రెట్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. సినిమా అంతా అల్లు అర్జున్ గుట్కా నములుతూ ఉండడం మనం చూశాం. గుట్కా నోట్లో ఉండటంతో మాట్లాడటం కూడా కాస్త డిఫరెంట్ గా మాట్లాడాడు. దమ్ముంటే పట్టుకోర షెకావత్ పాట కూడా అల్లు అర్జున్ నోట్లో గుట్కా పెట్టుకునే ఉన్నాడు. సినిమాలో ఎక్కడా అల్లు అర్జున్ క్లీన్ వాయిస్ లేకుండా చేయడంలో సుకుమార్ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు బయటకి వచ్చింది.
నార్త్‌లో ఎక్కువగా గుట్కా ఉపయోగించడం మనం చూస్తుంటాం. ఈ అలవాటుని తన సినిమాలో హీరోకి చూపిస్తే అక్కడ ఎక్కువ స్పందన వస్తుందని భావించిన సుకుమార్ బన్నీతో అలా చేయించాడట. అంతేకాదు బన్నీ గెటప్ లో కూడా కాస్త నార్త్ టచ్ చేసి ఆయన డ్రెస్సింగ్‌లో కూడా అది కనిపించేలా చేశాడు. మొత్తానికి సుకుమార్ చేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ కావడం, సినిమాకి భారీగా రెస్పాన్స్ రావడం జరిగింది. ఇక సుకుమార్ తెరెక్కించిన ‘పుష్ప 2’ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్, తారక్ పొన్నన్న,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించి సందడి చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.