Devisri Prasad | టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవిశంకర్‌ను ఉద్దేశించి దేవిశ్రీ మాట్లాడుతూ.. ఈ మధ్య నా పనికి సంబంధించి నా మీద ప్రేమకన్నా ఈ మధ్య కంప్లయింట్స్ ఎక్కువయ్యాయని నిర్మాతలు చెబుతున్నారు ఈ విషయం బయటనే చర్చిద్దాం అంటూ కామెంట్లు చేశాడు. దీనితో పాటు క్రెడిట్స్, రెమ్యునరేషన్ ఏదైనా సరే అడిగి తీసుకోవాల్సిందేనని అడుగుతూ బన్నీకి కూడా కోట్ చేయడం చర్చకు దారి తీసింది. అయితే ఈ వివాదంపై తాజాగా నిర్మాత రవిశంకర్ స్పందించాడు.
దేవిశ్రీ అన్నదాంట్లో మాకు తప్పు కనిపించలేదు. ప్రేమతో పాటు ఫిర్యాదులు ఉంటాయి. దేవిశ్రీ అదే చెప్పాడు. అంతే తప్ప అతడికి వేరే ఉద్దేశం లేదని.. దీనిని పెద్దగా చేస్తూ మీడియా కథనాలు రాసిందని క్లారిటీ ఇచ్చారు. అలాగే.. ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లోను దేవిశ్రీతో పనిచేస్తాము అంటూ వివాదాలకు చెక్ పెట్టాడు రవి.