Allu arjun | బుల్లితెరపై అల్లు అర్జున్.. పంచ్‌లు మామూలుగా వేయలేదుగా..

Allu arjun | ఒకవైపు పుష్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు టీవీ ఈవెంట్స్‌కు కూడా వస్తున్నాడు అల్లు అర్జున్. ఈటీవీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఢీ 13 ఫినాలేకు వచ్చాడు బన్నీ. సరిగ్గా పది సంవత్సరాల కింద ఢీ 3 ఫైనల్‌కు వచ్చి విన్నర్‌ను అనౌన్స్ చేసిన బన్నీ.. దశాబ్దం తర్వాత మళ్లీ ఈ డ్యాన్స్ షోకు ముఖ్య అతిథిగా వచ్చాడు. అప్పటి స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈ పదేళ్లలో కెరీర్లో ఎంత గ్రోత్ సాధించాడు అల్లు వారబ్బాయి. మరో రెండు వారాల్లో పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.
డిసెంబర్ 6న ట్రైలర్ కూడా విడుదల కానుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కానుంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఢీ 13 ఫైనల్లో కంటెస్టెంట్స్‌తో పాటు జడ్జిలపై కూడా అదిరిపోయే సెటైర్లు వేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. వచ్చీ రాగానే పూర్ణను టార్గెట్ చేశాడు అల్లు అర్జున్. ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తే ఆమె బుగ్గ కొరుకుతుంది అని యాంకర్ ప్రదీప్ చెప్పగానే.. ఇంకా బాగా చేస్తే ఏం చేస్తుందో అంటూ మాటలతో రొమాన్స్ మొదలు పెట్టాడు అల్లు అర్జున్. ఇక ప్రియమణిని కూడా వదల్లేదు బన్నీ. ఎవరైనా బాగా పరిచయం చేస్తే ఆమె పిలిచి కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెబుతోంది అంటూ ప్రదీప్ చెప్పాడు.
దానికి కూడా వెంటనే పంచ్ వేశాడు అల్లు అర్జున్. నాకు ఒక కోరిక మిగిలిపోయింది.. ఇప్పటి వరకు అల్లు అర్జున్‌తో నటించలేదు అని ప్రియమణి చెప్పగానే.. ఇప్పటికీ బాగానే ఉన్నావ్.. బరువు తగ్గి హాట్ హాట్‌గా మారిపోయావు అంటూ సెక్సీ కామెంట్ చేశాడు బన్నీ. దాంతో అక్కడున్న వారు మాత్రమే కాదు టీవీల ముందు ఉన్న అభిమానులు కూడా అమ్మో అల్లు అర్జున్ మామూలోడు కాదు.. మాటలతో అందరిని ఐస్ చేస్తున్నాడు కదా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rashmika surprise gift | అల్లు అర్జున్‌కు రష్మిక ఏం గిఫ్ట్ పంపిందో తెలుసా..?
Allu Arjun: బిగ్ బాస్ స్టేజ్‌పై సల్మాన్‌తో కలిసి సందడి చేయనున్న అల్లు అర్జున్
పుష్ప సినిమాలో అనసూయ సంచలన పాత్ర.. దాక్షాయణి ఎలా ఉండబోతుందంటే..?
Spider Man: పుష్ప దెబ్బకు స్పైడర్ మ్యాన్ చిత్రం ఓ రోజు ముందుకెళ్లిందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

