పుష్ప సినిమా నుంచి సర్ ప్రైజులు అస్సలు ఆగడం లేదు. ఒకదాని వెంట మరోటి వస్తూనే ఉన్నాయి. రోజూ ఏదో ఓ ప్రత్యేకం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. ప్రమోషన్ కూడా అలాగే జరుగుతుంది. రిలీజ్‌కు మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో తగ్గేదే లే అంటున్నారు పుష్ప యూనిట్. తాజాగా మరో సాంగ్ ప్రోమో వచ్చేసింది. అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.
ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. నవంబర్ 19 ఉదయం 11.07 నిమిషాలకు పూర్తి పాట విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ విడుదలైంది. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. మరోసారి తనదైన స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్నాడు ఐకాన్ స్టార్. సోషల్ మీడియాలో ఈ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jhanvi Kapoor | జాన్వీకపూర్ ఫాలోవర్లకు బ్యాడ్ న్యూస్..!
Shyam Singha Roy Vs Ghani | గని నిర్మాతల తీరుతో శ్యామ్ సింగరాయ్ వెనకడుగేస్తాడా..?
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్