ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భానుచందర్ (Bhanuchander). చాలా కాలం తర్వాత ఈ సీనియర్ యాక్టర్ వార్తల్లో నిలిచాడు. రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమాపై కామెంట్ చేయడమే దీనికారణం. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత (Samantha)ను ఆకాశానికెత్తేయడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కేవలం సమంత వల్లే పుష్ప సినిమా హిట్టయిందని అన్నాడు భానుచందర్.
వివిధ భాషల్లో సమంత చేసిన ఊ అంటావా ఊ ఊ అంటావా పాట యావత్ దేశాన్ని షేక్ చేసింది. థియేటర్లకు ప్రేక్షకులు పరుగులు పెట్టేలా చేసింది. అందువల్లే పుష్ప సినిమా విడుదలైన అన్ని భాషల్లో హిట్టయ్యిందన్నాడు. నేషనల్ బాక్సాపీస్ వద్ద చాలా వరకు దక్షిణాది సినిమాలు అద్బుతాలు సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ ఇపుడు బాలీవుడ్ ని అధిగమించేసిందని అన్నాడు.
ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించాడు. ఒక్కసారి ఆరోగ్యం పాడైతే ఏ సెలబ్రిటీ స్టేటస్ కాపాడలేదని అందువల్ల ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు భానుచందర్.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!