Pushpa 2 Wild fire JAAthara | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారని తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను అనౌన్స్ చేశారు మేకర్స్.
ఇప్పటికే ఈ సినిమా ఈవెంట్లను పాట్నా, కొచ్చిలతో పాటు, ముంబై, చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హోమ్ టౌన్లో ఈ వేడుక జరుగబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ మాస్ జాతరను హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
After celebrating THE BIGGEST INDIAN FILM across the nation, it’s time to bring that euphoria home ❤🔥 #Pushpa2WildfireJAAthara in HYDERABAD on December 2nd from 6 PM onwards 💥💥
Venue : Police Grounds, Yousufguda #Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5thIcon Star… pic.twitter.com/JZWuR9rvru
— Pushpa (@PushpaMovie) November 30, 2024