Pushpa 2 The Rule | పాన్ ఇండియా, గ్లోబల్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ సినిమా పుష్ప ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప ప్రాంఛైజీలో వస్తున్న సీక్వెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు.
కాగా రీసెంట్గా ఈ మూవీ నుంచి కపుల్ సాంగ్ సూసేకి (Sooseki) సాంగ్‌ను లాంఛ్ చేశారని తెలిసిందే. ఈ పాటను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో లాంఛ్ చేయగా.. నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్, 1.67 మిలియన్లకుపైగా లైక్స్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది. కపుల్ సాంగ్ వైబ్కు ఫిదా అయిపోతున్న మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్ ఇప్పటికే నెట్టింట రీల్స్ చేస్తున్నారు. మరోవైపు ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ కూడా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
మొత్తానికి విడుదలకు ముందే పుష్ప ది రూల్ మరో మ్యూజికల్ హిట్‌గా నిలిచిపోవడం పక్కా అయిపోయినట్టేనని తాజా అప్డేట్స్ చెబుతున్నాయి. పుష్ప ది రూల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
People just cannot stop vibing to #TheCoupleSong ❤️🔥#Pushpa2SecondSingle TRENDING #1 on YouTube for music with 100 MILLION+ VIEWS & 1.67 MILLION+ LIKES 💥💥
▶️ https://t.co/Ko86XxgEyS#Sooseki #Angaaron #Soodaana #Nodoka #Kandaalo #Aaguner 👌 #Pushpa2TheRule Grand release… pic.twitter.com/vSsY38GYPI
— Mythri Movie Makers (@MythriOfficial) June 14, 2024
సూసేకి లిరికల్ వీడియో సాంగ్..