Pushpa 2 Reloaded | అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించింది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే బాహుబలి 2 రికార్డుతో పాటు బాలీవుడ్ అత్యధిక కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టిన ఈ చిత్రం రూ.2000 కోట్ల దిశగా దూసుకెళుతుంది. అయితే ఈ క్రమంలోనే పుష్ప 2 మేకర్స్ సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో విడుదలకు ముందు డిలీట్ చేసిన 20 నిమిషాలను యాడ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 11 నుంచి యాడ్ చేసిన 20 నిమిషాల డిలీటెడ్ సీన్స్ జత చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ డిలీటెడ్ సీన్స్‌లో పుష్ప ఎంట్రీ సీన్లో వచ్చిన ఫైట్‌లో వాటర్‌లో పడడంతో కట్ అయిన సీన్‌ను యాడ్ చేస్తుండగా.. దీనితో పాటు కన్నడ నటుడు తారక్ పొన్నప్పతో వచ్చే యాక్షన్ సీన్‌ని కూడా జత చేయబోతున్నట్లు తెలుస్తుంది.
#Pushpa2TheRule RELOADED VERSION with 20 minutes of added footage will play in cinemas from 11th January 💥💥
The WILDFIRE gets extra FIERY 🔥#Pushpa2Reloaded ❤️🔥#Pushpa2#WildFirePushpa pic.twitter.com/WTi7pGtTFi
— Mythri Movie Makers (@MythriOfficial) January 7, 2025