Pushpa 2 The Rule Breaks The Record | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా మొదటిరోజు నుంచే హిందీలో రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.
మొదటిరోజే హిందీలో షారుఖ్ ఖాన్ జవాన్(Jawan) పేరిటా ఉన్న రికార్డును బద్దలుకొట్టిన పుష్పరాజ్ ఆ తర్వాత వరుసగా మూడు రోజులు రికార్డు కలెక్షన్లు సాధించాడు. ఇప్పటివరకు హిందీలో ఏ సినిమాకు కూడా సాధ్యం కానీ ఒక్క రోజుల్లో(రూ.86 కోట్ల కలెక్షన్స్) రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం మరో రికార్డును నమోదు చేసింది. కేవలం 13 రోజుల్లోనే రూ. 601.50 కోట్ల నెట్ కలెక్షన్స్ను అందుకుంది. దీంతో అల్లు అర్జున్ సినిమా హిందీలో రెండో అతి పెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డును అందుకుంది. దీనికంటే ముందు ఈ రికార్డు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్(రూ.584 కోట్లు) పేరిట ఉంది.
#Pushpa2TheRule is THE FASTEST HINDI FILM to hit the 600 CRORES mark 💥
Collects 601.5 CRORES NETT in 13 days and records the highest collection on 2nd Tuesday for any Hindi film❤️🔥
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/SYTfVDX4l1
— Mythri Movie Makers (@MythriOfficial) December 18, 2024