Pushpa-2 Movie Glimps | పది రోజుల కిందట రిలీజైన ‘పుష్ప-2’ గ్లింప్స్ ఏ రేంజ్లో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ సోషల్ మీడియాను పులిలా షేక్ చేసింది. ఈ సారి బన్నీ-సుక్కు రీ-సౌండ్ పక్క దేశాల్లో కూడా వినిపించేలా కనిపిస్తుంది. ఇక పోస్టర్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఒక స్టార్ హీరో అలాంటి గెటప్ వేశాడంటేనే ప్రశంసించాల్సిన విషయమే. ఇక ఇదిలా ఉంటే తాజాగా పుష్ప వీడియో రికార్డులు క్రియేట్ చేసింది.
బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజైన పుష్ప-2 గ్లింప్స్ అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటివరకు ఈ వీడియోకు తెలుగుతో సహా అన్ని భాషల్లో కలిపి 100మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే పది కోట్ల మంది పుష్ప గ్లింప్స్‌ను ఇప్పటివరకు చూశారు. అంతేకాకుండా ఈ వీడియోకు 3.3 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. ఒక్క గ్లింప్స్‌కే ఈ రేంజ్లో రికార్డులు పడితే ఇక టీజర్, ట్రైలర్లు మరెన్ని రికార్డులు నెలకొల్పుతాయో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పుష్ప-2పై టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ తొలిభాగం విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. తొలిరోజు నుంచి కాసుల వర్షం కురిపిస్తూ నిర్మాతల పాలిట కామధేనువులా మారింది. ఇక ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో బన్నీ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
PUSHPA RAJ ANNOUNCES HIS BLOCKBUSTER RULE 💥
Record Breaking 100M+ views and 3.3M+ likes for the #Pushpa2TheRule Glimpse 🔥#WhereisPushpa?
– https://t.co/eNEiADQGP0Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/RLPL4hetRR
— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2023