Pushpa-2 Movie Audio Rights | బన్నీ, సుక్కు కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇక ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో బన్నీ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పుష్ప-2పై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. షూటింగ్ దశలో ఉండగానే పుష్ప సీక్వెల్ కోసం పలువురు బడా సంస్థలు కోట్లల్లో ఆఫర్ చేస్తున్నారట. అంతేకాకుండా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందట. తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులకు సంబంధించిన వార్త హల్ చల్ చేస్తుంది. ప్రముఖ ఆడియో సంస్థ టీ-సిరీస్ పుష్ప-2 ఆడియో హక్కులను దాదాపు రూ.65 కోట్ల పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఓ ఆడియో హక్కులు అమ్ముడవడం ఇదే తొలిసారి.
ఇక పుష్ప-1 పాటలు ఏ రేంజ్లో ఊపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆల్బమ్‌లోని అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. అన్ని భాషల్లో కలిపి 1 బిలియన్ వ్యూస్‌ను రాబట్టాయి. ఈ క్రమంలోనే టి-సిరీస్ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఆడియో రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్ప-2 విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ఇక సెకండ్ పార్ట్‌తో అందరిలోనూ ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవలే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.